18 ఎప్రిల్ 2014 శుక్రవారం

వాళ్లకు రాజనీతి బోధించండి!


‘మార్గం సుదీర్ఘం’,‘భూమి గుం డ్రం’ అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్ర మహాసభతో మొదలయిన తెలంగాణ అస్తిత్వం దొరలూ, జమీన్‌దార్లు, జాగీర్‌దార్లను పల్లెల నుంచి తరిమేసిన క్రమాన్ని కళ్ళకు కడుతుంది. అలా పారిపోయిన దొరలు రెండుమూడేళ్ల అజ్ఞాతం తరువాత మళ్ళీ ఎలా గ్రామాలకు చేరుకొని ‘పునర్నిర్మాణానికి’ పునాదులు వేసుకుంటారో దాశరథి  తరువాతి కాలంలో రాసిన ‘జనపథం’ నవలలో వివరిస్తారు. కథ, చెప్పిన పద్ధతి, అందులోని రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఇది జరిగిన సంగతి. 1942-52 మధ్య చరివూతను పరిశీలిస్తే నిజంగానే చరిత్ర తనంతట తాను పునరావృతం అవుతుందనే అనిపిస్తుంది. అందుకే దాశరథి ‘భూమి గుండ్రం’ అన్నా డు. 

నిజాం రాజుల పాలనలోని లోపభూయిష్ట భూ పంపిణీ, యాజమాన్య విధానాల వల్ల భూస్వాము లే పాలకులుగా చెలామణి అయ్యారు.  నిజాం రాజులకు  తాబేదార్లుగా మారి ప్రజలను దోచుకుని దొరలయ్యారు. ఆ దొరల దోపిడీ, దాష్టీకాలకు హద్దూ అదుపు లేకుండా పోయింది. తెలంగాణ బతుకు ఛిద్రమైపోయింది. ఆ దశలోనే ప్రపంచం గర్వించే స్థాయిలో సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో ప్రారంభమయ్యింది. నాగలి పట్టాల్సి న రైతులు, రైతు కూలీలు తుపాకులు పట్టారు, సాయుధ దళాలు ఏర్పాటు చేసుకుని ‘భూస్వాముల’ మీద దండయావూతకు దిగారు. దొరలూ ప్రతిఘటించారు.రజాకార్లను ఉసిగొలిపి దొరికిన వాళ్ళ ను దొరికినట్టు  ఉద్యమకారులను ఊచకోత కోశా రు. వేలాదిమందిని జైళ్లలో తోశారు. కేసులు బనాయించారు. కోర్టులకు ఈడ్చారు. అయినా దొరలను నిజాం ప్రభువు కాపాడలేకపోయాడు, రజాకార్లు, కిరాయి మూకలు కాపాడలేకపోయా యి. కంటిచూపుతో మొత్తం సమాజా న్ని శాసించిన దొరలు తమ గ్రామాలు వదిలి, గడీ లు వదిలి పారిపోయారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అనేక నగరాలకు పారిపోయారు. ఉద్య మం ఉధృతంగా సాగినంత కాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అజ్ఞాతంలో గడిపారు. 

ఇదే అదనుగా నెహ్రూ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు చర్య పేరుతో భారత సైన్యాన్ని రంగంలోకి దింపి హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో కలిపేసుకుంది. అంతే! అప్పటిదాకా ఎక్కడెక్కడో దాక్కున్న దొరలంతా కొత్త అవతారాల్లో మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి చేరారు. అప్పటిదాకా వాడిన షేర్వానీలు వదిలేశారు. ఖద్దరు తొడిగారు. తలమీద గాంధీ టోపీలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో కలిసిపోయారు. సైన్యం, పోలీసు సెక్యూరిటీ వెంట బెట్టుకుని మళ్ళీ గ్రామాల్లో చేరిపోయారు. అప్పటి దాకా  నిజాం రాజు తొత్తులుగా వుండి, మొత్తం పల్లెల్ని దోచి, ఈ దోపిడీ నుంచి, వెట్టి నుంచి, గులాంగిరీ నుంచి, భూస్వామ్య బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని పోరాడిన ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు, ఇక్కడి జన జీవనాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు హటాత్తుగా జాతీయ వాదులై పోయారు. దేశ భక్తులయ్యా రు. కాంగ్రెస్ నేతలై కండువాలు కప్పుకున్నా రు. భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా నవసమాజా న్ని నిర్మిస్తామని ప్రతినబూనారు. తరువాత ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళే మళ్ళీ మంత్రులైపోయారు. 

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే పాలనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోకి తెచ్చేందుకు 1953లో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా మద్రా స్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలుగు తెలిసిన ఉద్యోగులను ఇక్కడికి ఆహ్వానించింది. పనిలో పనిగా  సాగు తెలిసిన కోస్తా రైతులను కూడా ఉచితంగా ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చి పిలిపించుకుంది. ఉద్యోగులను నియమించినప్పుడు పెద్ద ఎత్తున స్థానిక యువకులు, నిరుద్యోగులు నిరసన తెలిపా రు. ఆందోళనకు దిగారు. ‘నాన్-ముల్కి గో బ్యాక్’ పేరుతో ఉద్యమించిన పిల్లల మీద కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచివేసింది. అప్పటి నుంచి స్థానికుల నోళ్ళు మూయించి వేలాదిమందిని ఉద్యోగా ల్లో నియమించింది. ఇది వలసాధిపత్యానికి తొలి మెట్టు అయింది. అప్పటి దాకా కొనసాగిన నిజాం ముతక పాలనా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంది. ఇది జరిగి రెండేళ్ళు కూడా గడవక ముందే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మం తనాలు మొదలుపెట్టారు. ఆంధ్రా పెద్దలు కలిసి వుంటే కలదు సుఖం అన్నారు. తెలంగాణ పెద్దమనుషులు ఎవరికి  సుఖం అని ఆలోచించలేకపో యారు. హైదరాబాద్ ముఖ్యమంవూతిగా ఉన్న బూర్గు ల రామకృష్ణారావు అలాంటి ఆలోచన చేసినా కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ పిలిపించి ఒప్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో బాగుపడతారని చెప్పింది. ఆయనా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో  ఆంధ్రవూపదేశ్ పునర్నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు. మళ్ళీ మంత్రులయ్యారు. కానీ పదేళ్ళు గడిచినా పరిస్థితి మారకపోగా మరింత శిథిలం అయ్యింది. ఇక చాలనుకున్న యువతరం తెలంగా ణ కోసం 1969 లో ఉప్పెనై లేచింది. ఆంధ్రా ఆధిపత్యశక్తులను, పాలకులను వాళ్లకు వంతలు పాడే తెలంగాణ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వ సహకారంతో ఆ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసింది. వందలాది మందిని హైదరాబాద్ వీధుల్లో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి వేసింది. అప్పటి పాలకుల్లో ఇప్ప టి నాయకుల తండ్రులున్నారు. కొందరు నేతల తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళే పెద్దమనుషులుగా ఉండి ఒప్పందాలు చేసుకుని, షరతులు పెట్టుకుని దాదాపు 1982 దాకా అదే తంతు కొనసాగించారు. 

ఈ పాలనే తెలంగాణ బతుకుల్ని రోడ్డు మీదికి తెచ్చింది.  దానికి తెలుగుదేశం పాలన కూడా తోడయ్యింది. ఇదే నాయకత్వం ఆ పార్టీ హయాంలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. జానాడ్డి లాంటి వాళ్ళయితే అక్కడా ఇక్కడా రెం డు చోట్లా ఉన్నారు. మళ్ళీ మొదలయిన తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు, అణచి వేసిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు, ఉద్యమకారుల మీద కేసులు బనాయించి జైళ్లలో తోసిన వాళ్ళు, చివరకు వేలాదిమందిని నిరాశలో ముంచి ఆత్మహత్యలకు పురికొల్పిన వాళ్ళు కూడా గడిచిన పదేళ్లుగా పాలించిన వాళ్ళే. వాళ్ళే ఈ విధ్వంసానికి మూలం అని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఇదంతా ఒక చరిత్ర.  

ఆ చరిత్ర క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక అధ్యయనాలు చేసి తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్యమానికి సన్నద్ధులను చేసింది. ఈ విధ్వంసంలో భాగంగా వచ్చిన నిబంధనలు ఉద్యోగులను ఊపిరాడకుండా చేస్తున్నాయన్న  ఆందోళనలో నుం చే కే.చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష, జేఏసీ ఏర్పా టు జరిగిపోయాయి. ఈ విధ్వంసమే అప్పటిదాకా అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా మాత్రమే ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పౌర సమాజానికి తిరుగులేని నాయకుడై నిలబడ్డాడు. రాజకీయవాదులు, పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా వెరవకుండా తుదిదాకా నిలబడి ఇప్పుడు పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించాడు.కానీ తెలంగాణ కాంగ్రెస్ అధినేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం అసలు విధ్వం సం జరగనే లేదని, అలాంటప్పుడు పునర్నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్  ఇంకా తటస్థంగా ఉంటే కుదిరేలా లేదు. వాళ్లకు రాజనీతిశాస్త్రం బోధించాల్సిన అవసరం ఉంది. వీలయితే చరిత్ర కూడా చెప్పాల్సి ఉంది. 

ఎవరయినా తెలియని వాళ్లకు చెప్పవచ్చు. కానీ తెలిసీ తెలియనట్ట్టు నటించే వాళ్లకు ఏది చెప్పినా ప్రయోజనం ఉండదు అని అనిపిస్తే మీకు మీరే ఒక చారివూతాత్మక నిర్ణయం తీసుకోండి. ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాధనకు ఊపిరై నిలబడ్డ రాజకీయ జేఏసీ పౌరసమాజానికి దిశా నిర్దేశం చేయక తప్పదు. మీతో భుజం భుజం కలిపి పోరాడినవాళ్ళను ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. విధ్వంసం జరిగిందని ఒప్పుకున్న పార్టీలను, పునర్నిర్మాణం అవసరాన్ని గుర్తించిన వాళ్ళను, నవ తెలంగాణ నిర్మించాలనే వాళ్ళనే బలపరచండి. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఆకాంక్షకు అర్థమే లేకుండాపోతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది.

10 ఎప్రిల్ 2014 గురువారం

దొరలెవరు? దొంగలెవరు?


పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్మాణం అంటే అర్థం తెలియక కాదు. వాదన వెనుక ఆయనకు తన సొంత అభివూపాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ధ్వంసమే కాలేదు అన్నది, రెండోది పునర్నిర్మాణం అవసరమే లేదన్నది. మామూలుగా అయి తే ఆయన అలాంటి వాదన చేయరు. కానీ కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం అని అన్నాడు కాబట్టి, తాను కేసీఆర్ వాదాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఆయ ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు. కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండేందుకే కేసీఆర్ ఎత్తుగడ వేశారన్నది ఆయన వాదన సారాంశం. ఒక్క ఆయన మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది  పునర్నిర్మాణం అనే పదానికి కొత్త కొత్త అర్థాలు వెతుకుతున్నారు. కొంద రు గడీల పునర్నిర్మాణం అంటే, మరి కొందరు భూస్వామ్య పునర్నిర్మాణం అని, ఇంకొంత మంది దొరతనం పునర్నిర్మాణమని ఎవరి భాష్యాలు వాళ్ళు చెబుతున్నారు. పాపం కేసీఆర్ రెండుసార్లు అదేపని గా మీట్ ది ప్రెస్ కార్యక్షికమాల్లో వివరించినా, తన చానల్లో నాలుగు గంటలపాటు విజేత విజన్ పేరు తో ప్రత్యక్ష ప్రసారంలో విడమరచి చెప్పినా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనంటే పొసగని వాళ్ళు పదేపదే ఇదంతాదొరతనంఅని దబాయిస్తూనే ఉన్నారు. నిజానికి దొర అనేది ఒక కులం కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక, భూమి మీద,ఉత్పత్తి మీద, మనుషుల మీద, మొత్తంగా సమాజంలోని అన్నిరకాల మానవ సం బంధాలమీద ఆదిపత్యం చెలాయించిన ఒకానొక దశ.

దొరలు ఒక్క వెలమ కులంలోనే లేరు. గడీలు కేవలం వాళ్ళవే కాదు. నల్లగొండలో ప్రారంభమైన  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రెడ్ల దొరత నం మీద తిరుగుబాటుగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్లుగా ఉన్న అన్ని అగ్రకులాలు ఉన్నాయి. కొన్నిచోట్ల వెలమ దొరలుంటే, చాలా చోట్ల రెడ్లు, మరికొన్ని చోట్ల కాపులు, కరణాలు  అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం జాగీర్దార్లు కూడా దొరతనం చెలాయించారుఇటువంటి అగ్రవర్ణ, కొన్నిచోట్ల ముస్లిం భూస్వాములంతా తమ ఆధిపత్యానికి ప్రతీకలుగా కోటలు, గడీలు నిర్మించుకున్నవాళ్ళే. ఇదంతా చరివూతలో నమోదైన వాస్తవం. అయినా తెలంగాణ సమాజం దొరతనానికి ఎన్న డూ భయపడలేదు, ఐలమ్మ, బందగీ లాంటి వాళ్ళ తరం నుంచి అయిలయ్య, రాజమల్లు తరం దాకా తెలంగాణ ప్రజలు పోరాటాల, ప్రజా  ఉద్యమాల ద్వారా దొరల మెడలు వంచిన వాళ్ళే. తన చెప్పుచేతల్లో బానిసల్లా పడిఉన్న సామాన్యులు తిరగబడి దొరలను పల్లెలు, పంట పొలాల నుంచి పరుగెత్తించిన సందర్భాలు ఇటీవలి తెలంగాణ చరివూతలో అనే కం. నిజానికి నడ్డి విరిగిపోయిన దొరతనాన్ని మళ్ళీ లేపి నిలబెట్టడం, శిథిలమై గబ్బిలాల గూళ్ళుగా మారిపోయిన గడీలను మళ్ళీ నిర్మించడం కేసీఆర్ వల్ల కాదు గదా ఆయన తాతల తరం వల్ల కూడా సాధ్యమయ్యే పనికాదు. అయినా సరే కొందరు అదేపనిగా దొరతనాన్ని ఇంకా తెలంగాణలో ఒక ఆధిపత్యశక్తి గా చూపడం తెలంగాణ ప్రజల పోరాట పటిమను, విజయాల చరివూతను తక్కువ చేయడమే అవుతుంది.

ఇప్పుడు ఎన్నికల సమయంలో కొందరు దొర వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. కాంగ్రె స్, టీడీపీ నాయకులు టీఆర్ఎస్ను దొరల చిరునామాగా చూపి కేసీఆర్ను దొరతనానికి నిలు నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావును, రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్న కేవీపీ రామచంద్రరావు కూడా వెలమ దొరలే అన్న సంగతి మరిచిపోతున్నారు. గడీల అధికారాన్ని ఎప్పుడో గల్లంతు చేసామని చెప్పే కొందరు ఉద్యమ కారులు కూడా ఈమధ్య దొరలవాదానికి  వంతపాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ చర్చలు వాదోపవాదాల్లో వినబడుతున్న దొరతరానికి నిర్వచనం ఏమి టో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వెలమ కులమే దొరల కులం అని కొందరు దళిత బహుజన మేధావులు భాష్యం చెప్పవచ్చు. దానిని వర్గ పోరాటాల్లో ఉన్నామని చెప్పేవాళ్ళు ఎలా సమర్థిస్తారు? దొరతనం కులంతో మాత్రమే రాలేదు, ఆధిపత్యం, అహంకారం కలిస్తేనే దొరతనం. అది కేసీఆర్లో ఉన్నట్టే దామోదర రాజనర్సింహలో దానంనాగేందర్లో కూడా ఉండవచ్చు కులంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినట్టే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా పుట్టారు. అంతేకాదు కులంతో సంబంధం లే ని సర్ ఆర్థర్ కాటన్ను కూడా ఆంధ్రాలో కాటన్ దొర అనే అంటారు, తెలుగు ప్రజలంతా బ్రిటిష్ పాలకుల ను తెల్లదొరలనే పిలిచారు.అలాగే ఆదివాసీ తెగల నాయకుల్లో కూడా దొరలున్నారు. అయినా పార్లమెంటరీ రాజకీయాల్లో దొరపూవరో, దొంగపూవరో తేలడం కష్టం. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ ఆస్తు లు, భూముల వివరాలు, అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్లో ఉండే అహంకారం చూసిన వాళ్లకు దొర తనానికి కులంతో పనిలేదని అర్థమౌతుంది. అదొక ఆధిపత్య వర్గం.ఉద్యమకాలంలో ఇటువంటి కుల వాదనే కొందరుమేధావులుప్రొఫెసర్. కోదండ రాం విషయంలోనూ తెచ్చారు. ఆయన కోదండరామ్రెడ్డి అని, అగ్రవర్ణ, ఫ్యూడల్ భావజాలానికి ఆయన ప్రతీక అని ప్రచారం చేశారు. పోటీగా కుల సంఘాలు, జేఏసీలు కూడా పెట్టి తెలంగాణవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయినా ఎన్నికలతో దొరతనం, కులతత్వం పోతుందని ఎవరైనా నమ్మితే అది భ్రమే.

ఎన్నికల్లో అగ్రకులాలు మరింత బలంతో ముందుకు వస్తున్నాయికులపరంగా రెడ్డి సామాజి వర్గం ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 42 ఓపెన్ స్థానాల్లో 35 ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. టీఆర్ఎస్ 12 చోట్ల వెలమలను 39చోట్ల రెడ్లను రంగంలోకి దింపింది. అలాగే  తెలంగాణను బీసీలకు ఇనాంగా ఇచ్చిన చంద్రబాబు సగం సీట్లను బీజేపీకి ఇచ్చేశారు. మిగిలిన వాటిలో రెడ్డి సామాజిక వర్గానికి 16 సీట్లు, వెలమలకు మూడు ఇచ్చి ఇక్కడ పెద్దగా జనాభా లేకపోయినా తన సొంత సామాజిక వర్గానికి  ఆరు సీట్లు కేటాయించా రు. 1 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించిన ఆయన బీసీని ముఖ్యమంవూతిని చేస్తానని బుకాయిస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. ఈసారి కూడా  కేసీఆర్ తన సహజ రీతిలో తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అనేకచోట్ల ఉద్యమకారులను, టీఆర్ఎస్ కోసం అహరహం పనిచేసిన వాళ్ళను ఆపార్టీ  పక్కనపెట్టింది. చెరుకు సుధాకర్, దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, ఏర్రోళ్ల శ్రీనివా స్, మందుల సామేలు ఇట్లా పార్టీని కంటికి రెప్పగా కాపాడిన వాళ్లకు అనేక మం దికి బలమైన కులం కాదనే కారణంతో టీఆర్ఎస్ మొండిచేయి చూపింది. అలాగే కుటుంబ ఆధిపత్యాన్ని మరింత విస్తరించే రీతిలో టికెట్లను కేటాయించుకుంది. అన్ని పార్టీల లాగే టీఆర్ఎస్ కూడా  అగ్ర కులాలకే పెద్దపీట వేసింది. రెడ్లకు 39, వెలమలకు 12 స్థానాలు పార్టీ కేటాయించింది. ఇట్లా శాసనసభలో కుర్చీలన్నీ అగ్రకులాలకే రిజర్వు చేసి సామాజిక తెలంగాణ నిర్మిస్తామని ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేస్తామని, సాధికారత సాధిస్తామని చెపితే అమాయకులు తప్ప ఎవరు మాత్రం నమ్ముతారు.

అలాంటి అమాయకుల కోసమే కొందరు పదేపదే దొరతనం మీదికి దృష్టి మళ్లిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం అందులో భాగంగా  సామాజిక సాధికారత సాధించాల్సిన ప్రణాళిక మీద చర్చ జరగాల్సి ఉంది. తెలంగాణ జేఏసీ కూడా అటువంటి ప్రజా మేనిఫెస్టో ఒక టి ప్రకటించింది. అనేక కులవృత్తి సంఘాలు తమ తమ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండాల ని భవిష్యత్ తెలంగాణలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇటువంటి మౌలిక విషయాల వైపు చర్చ వెళ్ళకుండా ఉండేందుకే కొన్నిశక్తులు ఇప్పుడు దొరతనం, ఉద్యమ ద్రోహం వంటి వాటిని ప్రస్తావిస్తున్నాయి. ఊకదంపుడు వాదనలో ఎవ రు ఉద్యమకారులో, ఎవరు ద్రోహులో తేలడం కూడా కష్టంగానే ఉంది. పన్నెండేళ్ళ టీఆర్ఎస్ పోరా చరిత్ర ఒక్క కొండా సురేఖ చేరికతో పాప పంకి లం అయిపోయిందని కొందరు తీర్పులు చెపుతున్నారు. అదే సమయంలో అరవైఏళ్లుగా తెలంగాణ ఆకాంక్షను అణచివేసి, వందలమంది ఉద్యమకారుల చావులకు, వేలాదిగా కేసులకు వేధింపులకు కారణమైన కాంగ్రెస్ను తెలంగాణ ఇవ్వడం ద్వారా పునీ తమైందని కూడా ప్రచారం చేస్తున్నారు. వీపుల మీది గాయాలు మానిపోకముందే, తలల మీద కేసులు తొలగిపోక ముందే కొందరు ఉద్యమకారులు కాంగ్రె స్ జెండాలు మోస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్కి శవయావూతాలు, పిండ ప్రదానాలు చేసిన వీళ్ళే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అది  పవి త్రం అయిపోయినట్టు చెపుతున్నారు. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అండతో కాంగ్రెస్, టీడీ పీ నాయకులను అలాగే జగన్ను తెలంగాణలో అడు గు పెట్టనివ్వోద్దని ప్రకటించిన జేఏసీ ఇప్పుడు కొన్ని పార్టీలకు మినహాయింపు ఇస్తోంది. జగన్ను తెలంగాణకు రప్పించిన సురేఖను ద్రోహిగా ప్రకటిస్తున్నా రు. మంచిదే కానీ అంతకంటే డాబుగా చంద్రబాబు ను తెలంగాణలో తిప్పిన ఎర్రబెల్లి మీద నోరు ఎందుకని నోరుమెదపడంలేదు అలాగే కొత్తపెళ్లి కొడుకును పల్లకీలో ఊరేగిన్చినట్టు కిరణ్కుమార్రెడ్డిని తెలంగాణ జిల్లాల్లో రచ్చబండలకు మోసుకు తిరిగిన  మం త్రులకు ఎలా మద్దతు ఇస్తున్నారు

 ఈమధ్య చాలామంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. ఇది  ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపే మాట. ఎవరో ఇస్తే కాదు తెలంగాణ ప్రజలు నిలబడి పోరాడి సాధించుకున్నది. అది ఉద్యమ ఫలితం. కాంగ్రెస్ మాత్రమే కాదు,అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలను గౌరవించి తలవచా ల్సిందే. కొందరు కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అంటున్నారు. నిజమే కావొచ్చు, కానీ తెలంగాణ ఇవ్వకుండా ఒక్కరైనా ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చేవారా అన్నది ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల ఆత్మగౌరవాన్ని పోరాట స్ఫూర్తిని కించపరిచే మాటలు. సంగతి కాంగ్రెస్ నేతలు, వారిని అభిమానిస్తోన్న తెలంగాణవాదులు కూడా గుర్తిస్తే మంచి దిఓటు వేసేముందు తెలంగాణ ఉద్యమంలో దొరపూవరో, దొంగపూవరో ప్రజలు గమనించాలి.

కేవలం 18 స్థానాలు ఇచ్చి బీ సి లను ముఖ్యమంత్రి చేస్తానన్న చంద్రబాబు మాటలను ఆర్. కృష్ణయ్య గారు ఎలా నమ్ముతున్నారు?


జాక్ నేతలకు కాంగ్రెస్ టికెట్స్!


4 ఎప్రిల్ 2014 శుక్రవారం

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణలో ఇప్పుడు నవ తెలంగాణ నినాదం మారు మోగుతోంది. రాజకీయపార్టీల ఎన్నికల ప్రణాళికలు మొదలు పత్రికల్లో మేధావుల విశ్లేషణల దాకా ఈ కల ఎలా వుంటుందో చెప్పి ఊరిస్తున్నాయి. ఇవన్నీ మన నీళ్ళ గురించి, వనరుల గురించి, వైద్య, విద్యా, ఉపాధి అవకాశాల గురించి ఊరిస్తున్నాయి. ఉపదేశిస్తున్నాయి. తెలంగాణలో ఒక సమగ్ర ప్రణాళిక ఉంటే అభివృద్ధి సాధ్యమేనని భరోసా కల్పిస్తున్నాయి. కానీ తెలంగా ణ సమాజాన్ని ఎలా పునర్నిర్మిస్తారు. నవ సమాజం లో మానవ సంబంధాలు, పాలకులకు ప్రజలకు మధ్య పరస్పర సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటాయి అనే విషయాల మీద చర్చ జరగడం లేదు. భారత రాజ్యాంగ రచన నిజానికి ఇలాంటి మౌలికమైన అంశాల ప్రాతిపదికన మాత్రమే జరిగింది. పౌరులందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడమే నవభారత నిర్మాణానికి ప్రాతిపదిక అని రాజ్యాంగ పీఠికలోనే చెప్పారు. రాజ్యాంగంలోని అన్ని అధ్యాయా లు దానికి కట్టుబడి ఆ పరిధిలోనే సాగుతాయి. ఈ నాలుగు రకాల లక్ష్యాలు నేరవేరితేనే అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి తప్ప అభివృద్ధికి భౌతికరూ పాలైన కట్టడాలు, నిర్మాణాలు, మౌళిక వసతుల కల్పన మాత్రమే అభివృద్ధి అనుకోవడానికి వీలు లేదు. రాజ్యవ్యవస్థ, పరిపాలన న్యాయం మీద నడి చి, సమానత్వ సాధన ఒక లక్ష్యంగా నిర్దేశించుకుని, ప్రతివ్యక్తికి, సమాజానికి స్వేచ్ఛను కల్పించినప్పుడే ఆ సమాజంలో సౌభ్రాతృత్వానికి ప్రాతిపదిక అయి న మనం అనే భావన పెరిగి ప్రజాస్వామికీకరణకు తోడ్పడుతుంది. అటువంటి పాలనను తెలంగాణ సమాజం అనేక దశాబ్దాలుగా కలగన్నది. ఆ కల సాకారం కోసం అప్రమత్తతో పోరాటాలు నిర్మించిం ది. నిర్వహించింది. 

నిజానికి తెలంగాణ ఉద్యమం జనబాహుళ్యాన్ని ఆకట్టుకోవడానికి విస్తృతరీతిలో ప్రజలు ఉద్యమంలో పాల్గొనడానికి నెరవేరకుండా మిగిలిపోయిన ఆ కలే కారణం. ఆ కల నెరవేరి తీరాలని అనుకున్న వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని అన్నారు. సామాజిక తెలంగాణలాగే ప్రజాస్వామిక తెలంగాణ కూడా నినాదాలతో వచ్చే ది కాదు, అది నిర్మించుకోవాల్సిన బాధ్య త. ఆ బాధ్యత పాలక వర్గాల మీద ప్రజలు, ప్రజా ఉద్యమాల మీద ఉంటుంది. కానీ ఈ రెండు వర్గాలూ తమ తమ ప్రణాళికలు, మ్యానిఫెస్టోలలో వాటి సం గతి మరిచిపోతున్నారు. 

తొలి తెలంగాణ ఉద్యమం విఫలమైన దశలోనే మిగిలిపోయిన ఆ ఆకాంక్ష నుంచే ప్రజాస్వామిక విప్లవ ప్రయత్నాలు మొదలైనాయి. 1969 తెలంగాణ ఉద్యమ అణచివేతలో గాయపడిన యువ హృదయాలు విముక్తి మార్గం ఒక్కటే పరిష్కారం అనుకున్నాయి. మల్లోజుల కోటేశ్వర్‌రావు మొదలు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు అటువంటి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టి దాన్నొక దేశవ్యాప్త ఆకాంక్షగా మలిచా రు. అది అలా కొనసాగుతున్న సందర్భంలోనే ప్రజాస్వామ్య ఆకాంక్షల అణచివేత మొదలయ్యిం ది. సమాజం ప్రజాస్వామికంగా ఉండాలంటే రాజ్యాంగం చెప్పిన ఆర్థిక, సామాజిక రాజకీయ న్యాయం ఉండాలి. ఎటువంటి వివక్షలేని సమాన త్వం విలసిల్లాలి. ప్రతి పౌరుడికి స్వేచ్ఛాయుత జీవనం సాగించే హక్కులు ఉండాలి. నేను నాది అని కాకుండా మనం అనే భావనలో ప్రజలు ఉం డాలి. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే మౌలికంగా సమాజం పునాదులు మారాలి. అటువంటి సమ సమాజం ప్రయత్నాలన్నీ ప్రభుత్వాలు విఫలం చేస్తూ వచ్చిన సందర్భంలోనే మన ప్రాంతం-మన ప్రభుత్వం అన్న భావన బలపడి చిన్న రాష్ట్రాలలో అది సంధించడం తేలిక అన్న భావన పెరిగింది. చిన్న రాష్ట్రాల ప్రజల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక భావసారూప్యత ఉంటుంది. కాబట్టి మిగతా ప్రజాస్వామిక విలువలు పెంపొందించి సమ సమా జం ఏర్పాటు చేయవచ్చునని నమ్మిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి పునాదులు వేశా రు. 

కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రజాస్వామిక పునాది వేసింది మాత్రం ప్రజా గాయకుడు గద్దర్. ఆ తరువాత తెలంగాణ విద్యావంతుల వేదిక అని చెప్పుకోవాలి. నూతన ఆర్థిక సంస్కరణల దుష్ఫలితాల ప్రభావంతో శిథిలమైపోయిన తెలంగాణ సమాజం నుంచి 1995 నాటికే అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. అప్పటికే అజ్ఞాతం వీడి జన బాహుళ్యంతో మమేకమై కదులుతున్న గద్దర్ భువనగిరిలో 1996లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ సభ ద్వారా తెలంగాణ కోసం గళమెత్తారు. ఆయన కు బెల్లి లలిత వంటి గాయకులూ తోడయ్యారు. ప్రజలను కదిలించి తెలంగాణ సాధనతోనే సమస్యలకు పరిష్కారమని చాటుతున్న సందర్భంలోనే ప్రభుత్వ దాడి మొదలయ్యింది. 1997లో గద్దర్ మీద కాల్పులు, ఆ తరువాత బెల్లిలలిత హత్యా జరిగాయి. తెలంగాణ కోసం నిలబడ్డ ఒక్కొక్కరినీ అంతం చేయడం కొనసాగింది. ఈ దశలోనే తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభతోపాటు ఐక్య కార్యాచరణ వేదిక వంటివి వచ్చాయి.ఒకవైపు ప్రజాస్వామిక ఉద్యమాల మీద ప్రభుత్వ అణచివేత చర్యలు, ప్రజాసంఘాలు పౌరహక్కుల ఉద్యమకారుల మీద దాడులు, తెలంగాణవాదుల హత్యలు కొనసాగుతున్న దశను తెలంగాణ సమాజం చవిచూసింది. రైతుల ఆందోళనలు, విద్యార్థుల ఉద్యమాలు, వీధిన పడ్డ కార్మికుల అణచివేత మొదలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్న అన్నిశక్తుల గొంతు నులిమే ప్రయత్నం, బూటకపు ఎన్‌కౌంటర్లు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఆయన కాలంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు మాట్లాడే మనిషి లేకుండా చేయడంతో ప్రజాస్వామిక విలువలు లేని పాలన తెలంగాణను అతలాకుతలం చేసింది. కేవలం హక్కులేకాదు, అవకాశాలు, బతుకుదెరువుకు భద్రతలేని స్థితి 1991-2000 మధ్య కొనసాగింది. అటువంటి వాతావరణంలో ప్రజాస్వామిక స్పృహ ఉన్న మేధావులు, వామపక్ష ఉదారవాదులు, ప్రజాస్వామిక వాదులు కలిసి తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ సమాజాన్ని అధ్యయనం చేసి జాగృతపరిచే ప్రయ త్నం చేశారు. తెలంగాణ అభివృద్ధి లేమిని, వనరుల దోపిడీని వివరిస్తూనే వివిధ ప్రజాస్వామిక ఉద్యమాలలో ఉన్న క్రియాశీల మేధావులను కలుపుకుపో తూ దీన్నొక విశాల వేదికగా మలిచారు. ఈ నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయ ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు తమ కలలను వెతుక్కున్నారు. ఉద్యమంలో భాగాస్వాములయి కదిలారు. తమ తమ రాజకీయ అభివూపాయాలతో ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్కలయిపోయిన హక్కులున్నాయి.ఇప్పుడు పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్న వాళ్ళు పౌరస్వేచ్ఛ గురించి తమ ఆలోచనలేమిటో చెప్పాలి. పౌర హక్కులతోపాటు పౌరులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఎలా అమలు చేస్తారో వివరించాలి. రాజ్యాంగ పరిధిలో తమ తమ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తుల పట్ల, ఉద్యమాల పట్ల, సంఘాల పట్ల, రాజకీయ పార్టీలు, సంస్థల పట్ల తమ వైఖరి ఏమిటో ప్రకటించాలి. ప్రజా సంఘా లు, ప్రజా ఉద్యమాల మీద తెలంగాణలో దాదాపు గడిచిన నలభై ఏళ్లుగా ప్రకటిత-అవూపకటిత నిషేధం అమలులో ఉంది. ఇది ప్రజల స్వేచ్ఛ, స్వాతంవూత్యాలను హరించడమే కాదు నియంతృత్వ పోకడలకు, ఆధిపత్య ధోరణులకు కారణం కూడా. ఈ నియంతృత్వం వాళ్ళే తెలంగాణ వనరుల దోపిడీ అప్రతిహతంగా కొనసాగింది. నియంతృత్వం, ఆధిపత్యం ఉన్నచోట ప్రజాస్వామ్యం ఉండదు. అలాంటప్పు డు ఉద్యమాలకు, విముక్తికి అర్థమే లేదు. ఈ విషయాలు పునర్నిర్మాణమే పని అని చెపుతున్న అంద రూ మరిచిపోయారు. ఎవరి ఎజెండాలో కూడా వీటి పట్ల స్పష్టత కనిపించడం లేదు. నిజానికి హక్కుల ప్రస్తావన లేకుండా, వాటి కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు, శక్తులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండాపజా ఉద్యమాలను కాపాడుకోకుండా ప్రజాస్వామిక తెలంగాణ అంటే అర్థమేలేదు. కేవ లం ఈ విషయాలే కాదు. ప్రజల భాగస్వామ్యం కూడా ప్రజాస్వామ్యంలో కీలకం అటువంటి భరో సా కనిపించడం లేదు. కేవలం ఆధిపత్యం చెలాయించే శక్తులే కాదు, అరిచేవాడి ఆందోళనను అర్థం చేసుకోగలిగే సున్నితత్వం పాలకులకు ఉండాలి. కులం, మతం కాకుండా రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన విలువ ఉంటుంది. 

ప్రజాస్వామ్యం అంటే నిరంతరం ఆచరించవలసిన ఒక విలువ, ఒక జీవన విధానం. ప్రజాస్వామి క సమాజానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆరు ప్రాతిపదికలు ముఖ్యమని చెపుతారు. రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడినప్పుడు అసమానతలు కనిపించని సమాజం ఉండాలని, ప్రతిపక్షం ఉండి తీరాలని. చట్టం, పాలనలో అందరూ సమానులే అన్న భావన ఉండాలని, రాజ్యాంగం పట్ల విధేయ త ఉండాలని, మెజారిటీదే రాజ్యమనే భావన ఉండకూడదని, సమాజానికి నైతిక నిబద్ధత ఉండాలని, ప్రజలే ప్రామాణికం కావాలని అంటారు. ఇవి పాటించినప్పుడు  రక్తపాతం లేకుండా ప్రజల సామాజిక, ఆర్థిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగే వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలిచిపోతుంది అని అంబేద్కర్ సంపూర్ణంగా నమ్మారు. కానీ పాలకులు ఆ విలువలు పాటించకపోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు రక్త తర్పణ చేయాల్సి వచ్చింది. నవ తెలంగాణలో కూడా ఆశించిన మార్పులు రాకపోతే నిజంగానే విప్లవాలు తప్పవు!